
ఏపీలో రేషన్ బియ్యం నాణ్యత పెంపు: ఇకపై కేవలం 10 శాతమే నూకలు!
ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం నాణ్యతను మరింత పెంచేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై రేషన్ ద్వారా అందించే బియ్యంలో కేవలం 10% మాత్రమే నూకలు ఉండనున్నాయి.
గతంలో రేషన్ బియ్యంలో నూకల శాతం 25% ఉండగా, సార్టెక్స్ టెక్నాలజీ ద్వారా దానిని తొలుత 15%కి తగ్గించారు.
అయితే దానిపై పూర్తి సంతృప్తి రాకపోవడంతో, ప్రస్తుతం ఆ శాతాన్ని మరింతగా తగ్గించి కేవలం 10%కి పరిమితం చేశారు.దీనివల్ల ప్రతి 100 కేజీల బియ్యంలో దాదాపు 90 కేజీలు అత్యంత నాణ్యమైన పూర్తి గింజలే లభిస్తాయి.
మార్కెట్లో ఇలాంటి నాణ్యమైన బియ్యం కిలో ధర రూ.
70 వరకు ఉండగా, రేషన్ దుకాణాల్లో మాత్రం పేద ప్రజలకు ఇవే బియ్యం పూర్తిగా ఉచితంగా అందుతుండటం విశేషం.
ప్రస్తుతం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఈ విధానం ప్రారంభం కాగా, రానున్న రెండు మూడు నెలల్లో ఇది రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ అందుబాటులోకి రానుంది.





